క్రీడాకారులకు కేంద్రం అవార్డులు...ఎవరెవరికి వచ్చాయంటే ?

క్రీడాకారులకు కేంద్రం అవార్డులు...ఎవరెవరికి వచ్చాయంటే ?

వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పలువురు క్రీడాకారులకు అవార్డులు ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ అవార్డుల్లో పారా అథ్లెట్ దీపామాలిక్‌కు రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం దక్కింది. రెజ్లర్ భజరంగ్ పూనియాను కూడా ఖేల్‌రత్న అవార్డు వరించింది. క్రికెటర్ రవీంద్ర జడేజాతో పాటు మరో 18 మందికి అర్జున పురస్కారాలు లభించాయి. జడేజాకు అర్జున అవార్డు లభించడంతో ఈ అవార్డు తీసుకున్న 54వ క్రికెటర్‌గా ఆయన నిలిచాడు. జడేజా కంటే ముందు సునీల్ గవాస్కర్, చందు బోరే. కపిల్ దేవ్, మొయిందర్ అమర్‌నాథ్, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, రోహిత్ శర్మ, మిథాలీ రాజ్, స్మృతి మందనా తదితరులు ఈ అవార్డు దక్కించుకున్నారు. 12 మంది సభ్యులతో కూడిన అవార్డుల కమిటీలో జస్టిస్‌ ముకుందకం శర్మ లీడ్ తీసుకోగా బైచుంగ్‌ భూటియా, మేరీకోమ్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు.