ప్రకృతి వైపరీత్యాలు ఎవరి చేతుల్లో ఉండవు...

ప్రకృతి వైపరీత్యాలు ఎవరి చేతుల్లో ఉండవు...

ప్రకృతి వైపరీత్యాలు ఎవరి చేతుల్లో ఉండవు అని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... బోటు మునక వంటి విపత్తులు ఎవరి చేతుల్లో ఉండవన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే సంఘటనలను కూడా ప్రతిపక్ష పార్టీ రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. బోటు మునక ప్రమాదాన్ని ప్రభుత్వ హత్యలతో పోల్చడం నీచమైన వ్యవహరం అని తెలిపారు. వైఎస్ హయాంలో పంజా గుట్ట ఫ్లైఓవర్ కూలిన ఘటన, గౌతమి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదాన్ని జగన్ ప్రభుత్వ హత్యలే అంటారా?. పావురాల గుట్టలో హెలీకాప్టర్ కూలి వైఎస్ చనిపోయారు, అదీ ప్రభుత్వ హత్యేనా? అని ప్రశ్నించారు. వారణాసిలో ఫ్లైఓవర్ కూలి 16 మంది చనిపోయారు.. అవీ యూపీ సర్కార్ చేసిన ప్రభుత్వ హత్యలేనని జగన్ అనగలరా? అని మండిపడ్డారు. మేం ప్రతిపక్షంలో ఉండగా ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వాళ్లని కాపాడాం. విమానాల్లో బాధితులను తరలించి స్వస్థలాలకు చేర్చాం, ఆనాడు మేం వ్యవహరించింది ప్రతిపక్ష పాత్ర అని గుర్తు చేశాడు.