ప్లే ఆఫ్ రేస్ ముందు ఆర్సీబీ కి షాక్...

ప్లే ఆఫ్ రేస్ ముందు ఆర్సీబీ కి షాక్...

ఐపీఎల్ 2020 లో ఎవరు ఉధించని విధంగా ప్లేఆఫ్స్‌ రేసుకు స్వల్ప దూరంలో నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఆ జట్టు పేసర్‌ నవదీప్‌ సైనీ గాయం కలవర పరుస్తోంది. ఆదివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సైనీ గాయపడటంతో అతను తదుపరి మ్యాచ్‌లకు ఉంటాడా.. లేదా అనేది అనుమానంగా మారింది. నిన్నటి మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో భాగంగా 18వ ఓవర్‌ వేస్తున్న సందర్భంలో సైనీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దాంతో సైనీ మైదానాన్ని వీడాడు. ఎంఎస్‌ ధోని స్టైట్‌గా కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నంలో సైనీ బొటన వేలు మధ్యలో చీలిక వచ్చింది. ఇదే ఇప్పుడు ఆర్సీబీని డైలమాలోకి నెట్టేసింది. కీలక మ్యాచ్‌లకు ముందు సైనీ గాయపడటంతో శిబిరంలో ఆందోళన నెలకొంది.

ఆర్సీబీ జట్టులో ప్రధాన పేసర్‌ సైనీ కావడంతో తదుపరి మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడో..లేదా అనేది చర్చనీయాంశమైంది. దీనిపై ఆర‍్సీబీ చీఫ్‌ ఫిజియోథెరపిస్ట్‌ ఇవాన్‌ స్పీచ్‌లీ మాట్లాడుతూ... ‘సైనీ కుడి చేతి బొటన వేలి మధ్యలో చీలిక వచ్చింది. మాకు మంచి సర్జన్‌ ఉండటంతో సైనీకి కుట్లు వేశాడు. అతని గాయాన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నాం. ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్‌ల్లో సైనీ ఆడతాడా.. లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. గాయం నయమవుతుందనే అనుకుంటున్నాం’ అని స్పీచ్‌లీ తెలిపాడు.