‘సూపర్ ఓవర్’ ట్రైలర్.. సూపర్

‘సూపర్ ఓవర్’ ట్రైలర్.. సూపర్

ప్రవీణ్ వర్మ దర్శకత్వంలో సుధీర్ వర్మ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘సూపర్ ఓవర్’. నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ‘సూపర్ ఓవర్’ మూవీ ట్రైలర్ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రిలీజ్ చేశారు. ట్రైలర్‌ని బట్టి క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. బెట్టింగ్‏లకు అలవాటు పడి పోలీస్ స్టేషన్‏కు దగ్గరలో దొంగతనం చేసిన ముగ్గురు వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించే మరో ఇద్దరు వ్యక్తుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. జనవరి 22న తెలుగు ప్రముఖ ఓటిటి వేదిక 'ఆహా'లో విడుదల కానుంది సినిమా. ఈ చిత్రానికి సన్నీ ఎమ్.ఆర్ మ్యూజిక్ అందించగా.. దివాకర్ మని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.