శివరాత్రికి రానున్న జాతిరత్నాలు

శివరాత్రికి రానున్న జాతిరత్నాలు

నవీన్ పోలిశెట్టి ఈ పేరు అందరికీ సుపరిచితమే. చేసింది ఒక్క సినిమానే అయినా అందరికీ గుర్తుండిపోయాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగా ప్రేక్షకుల ముందుకొచ్చిన నవీన్ ఏదో మ్యాజిక్ చేశాడు. అతడి మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అతడితో సినిమా చేయాలని యోచిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా నవీన్ చేస్తున్న సినిమా జాతిరత్నాలు. మొదటి సినిమాలో దొంగలను పట్టుకున్న నవీన్ తన రెండో సినిమాలో తానే ఒ ఖైదీగా మారుడు. ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అయితే ఇందులో నవీన్‌తోపాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శీలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని కేవీ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా స్వప్న సినిమా పతాకంపై నాగ్‌అశ్విన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా ప్రచార చిత్రాలు మంచి స్పందన పొందాయి. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జాతిరత్నాలు సినిమా శివరాత్రి స్పెషల్‌గా మార్చి11న విడుదల కానుందట. అయితే ఈ విషయాన్ని తెలుపుతూ చిన్నపాటి వీడియోను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ఎప్పుడని మీడియా వారు అడుగుతున్నట్లు చిన్న హాస్య భరితమైన వీడియో ద్వారా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి వారి అంచనాలకు తగ్గట్లుగా నవీన్ అలరిస్తాడేమో చూడాలి.