'చిచోరే' జాతీయ అవార్డుపై నవీన్ ట్వీట్ వైర‌ల్...

'చిచోరే' జాతీయ అవార్డుపై నవీన్ ట్వీట్ వైర‌ల్...

కొంత మంది మనకు భౌతికంగా దూరమైనా... వారితో గడిపిన క్షణాలు, అనుబంధం జీవితాంతం సజీవంగా ఉంచుతుంది. అలా సుశాంత్ సింగ్ తో అనుబంధం ఉన్న వారు ఆయన నటించిన 'చిచోరే'కు జాతీయ అవార్డు రాగానే తనతో గడిపిన క్షణాలను నెమరువేసుకున్నారు. వారిలో మన జాతిరత్నం నవీన్ పోలిశెట్టి ఒకరు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలసి 'చిచోరే' సినిమాలో నటించాడు నవీన్. అవార్డు వచ్చిన సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకోవడానికి సుశాంత్ భౌతికంగా లేక‌పోవ‌డంతో న‌వీన్ తనని త‌లుచుకుని సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ అయ్యాడు. "ఓవైపు 'చిచోరే'కు జాతీయ అవార్డు వచ్చింది. మరోవైపు 'జాతిరత్నాలు' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. సుశాంత్‌.. ఇదంతా నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు. ఇది నీకే సొంతం. అలాగే యూనిట్‌కు శుభాకాంక్షలు. లవ్‌ యూ యాసిడ్‌" అంటూ ట్వీట్‌ చేశాడు నవీన్ పోలిశెట్టి. 'చిచోరే'లో హీరో ఫ్రెండ్‌ యాసిడ్‌ పాత్రలో నవీన్ నవ్వుల పువ్వులు పూయించాడు