కేసీఆర్‌కు ఒడిశా సీఎం లేఖ

కేసీఆర్‌కు ఒడిశా సీఎం లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. సైక్లోన్‌ ఫాని విధ్వంసం అనంతరం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఒడిశాకు తెలంగాణ తెలంగాణ అందించిన సాయం మరిచిపోలేనిదని అన్నారు. ఈమేరకు కేసీఆర్‌కు నవీన్‌పట్నాయక్‌ ఓ లేఖ రాశారు.  విద్యుత్‌ పునరుద్ధరణలో నిపుణులైన తెలంగాణ సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీమని ఆ లేఖలో పేర్కొన్నారు. 
తుపాను బీభత్సానికి ఒడిశాలో భారీ సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సుమారు 1000 మంది విద్యుత్‌ శాఖ ఉద్యోగులను ఒడిశాకు పంపారు కేసీఆర్‌.