ఒక్క హిట్.. ఆరు సినిమాలొచ్చి పడ్డాయి

ఒక్క హిట్..  ఆరు సినిమాలొచ్చి పడ్డాయి

నవీన్ పోలిశెట్టి.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా ప్రేక్షకులకు తెలియకపోవచ్చు.  కానీ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం తరవాత బాగా పరిచయమైంది.  ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు ఈమధ్యకాలంలో దొరికిన మంచి నటుల్లో ఇతను కూడా ఒకరు అంటున్నారు.  ఈ చిత్రం ఇచ్చిన సక్సెస్ అతన్ని జీవితాన్నే మలుపు తిప్పింది. 

ఆయనకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.  ఇప్పటికే ఒక సినిమాలో నటిస్తున్న ఆయన వైజయంతి బ్యానర్లో ఒప్పందం కుదుర్చుకున్నాడు.  లాగే ఇంకో మూడు నాలుగు మంచి కథల్ని  హోల్డ్ చేసి పెట్టాడట.  వాటిలో పేరున్న నిర్మాణ సంస్థల ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తోంది.  మొత్తానికి ఒకేఒక్క హిట్ అతన్ని బిజీ నటుడిగా మార్చేసింది.