సరిహద్దు దాటిన సిద్ధూ 

సరిహద్దు దాటిన సిద్ధూ 

మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోతిసింగ్ సిద్ధూ అత్తారి -వాఘా సరిహద్దు దాటి పాకిస్తాన్ లో అడుగుపెట్టారు. ఆయన నవంబర్ 28న కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.  కర్తార్ పూర్ కారిడార్ భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మరో చరిత్రాత్మక ఘట్టం కానుంది. పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్‌ గురుద్వారాకు భారత్‌ సరిహద్దుల్లోని డేరాబాబానానక్‌ నుంచి ఫోర్ లేన్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆయన పర్యటనకు కేంద్రంలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సిద్ధూను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మమద్ ఖురేషీ సరిహద్దు వద్ద సాదరంగా ఆహ్వానించారు. 

కర్తార్ పూర్ నుంచి కారిడార్ కు పాకిస్తాన్ తరఫున పునాధిరాయి బుధవారం ఇమ్రాన్ ఖాన్ వేయనున్నారు. ఈ కారిడార్ వల్ల భారత్ నుంచి సిక్కులు తమ పవిత్ర స్థలం గురుద్వారాకు సులభంగా చేరుకోవచ్చు. మొట్టమొదటి సిక్కు గురువు  గురునానక్ 18 ఏళ్ల నుంచి ఆయన మరణం వరకు ఇక్కడే నివాసించారని సిక్కుల విశ్వాసం . ఈ కారిడార్ భారత్ లోని గురదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ నుంచి ప్రారంభం అవుతుంది. గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్ పూర్ పాకిస్తాన్ లోని రావి నది ఒడ్డున ఉంది.