పాక్‌ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రే సబ్ జైలు..!

పాక్‌ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రే సబ్ జైలు..!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్లేట్‌లెట్ల సంఖ్య ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో.. ఆయనను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. లాహోర్‌లోని నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో కార్యాలయం నుంచి నేరుగా లాహోర్‌ సర్వీసెస్‌ ఆసుపత్రికి తరలించారు. దీంతో.. ఆయన కుటుంబ సభ్యులు, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్‌ షరీఫ్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మరోవైపు ఆయన చికిత్స పొందుతున్న గదిని తాత్కాలిక సబ్‌ జైలుగా అధికారులు ప్రకటించారు. ఎవరూ ఆయన్ని కలవకుండా పహారా కాస్తున్నాయి భద్రతా దళాలు.