కంటతడి పెట్టిస్తున్న నవాజుద్దీన్ సిద్ధికి ట్వీట్..!!

కంటతడి పెట్టిస్తున్న నవాజుద్దీన్ సిద్ధికి ట్వీట్..!!

నవాజుద్దీన్ సిద్ధికి బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లో నటిస్తూ నటుడిగా బిజీగా మారదు. నటనతో ఆకట్టుకోగల నటుల్లో నవాజుద్దీన్ ఒకరు అనే పేరు తెచ్చుకున్నాడు.  తెరపైన నటించడం వేరు నిజజీవితంలో జీవించడం వేరు.  తెరపై ఉండే కష్టాలు కొంతకాలమే.. కానీ, నిజజీవితంలో ఉండే కష్టాలు వేరు.  వాటిని పేస్ చేయడం చాలా కష్టం.  డబ్బు పొతే సంపాదించుకోవచ్చు.. శరీరానికి ఏదైనా జబ్బు చేస్తే దానిని తొలగించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.  ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిని భయపెడుతున్న జబ్బు క్యాన్సర్.  దీనికి సామాన్యుల.. సెలబ్రిటీల అనే భేదం ఉండదు.  

ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి బింద్రే క్యాన్సర్ తో ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, నవాజుద్దీన్ చెల్లెలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుందట.  ఆమెకు 18 వ సంవత్సరం దగ్గరి నుంచి ఆ జబ్బుతో బాధపడుతున్నది.  ఆ జబ్బుకు వైద్యం ఎంత ముఖ్యమో.. మానసికంగా ధైర్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం.  ఆనంద్ కొప్పికర్, లాలెహ్ బషెరి లు మానసికంగా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని.. రసూల్ పూకుట్టి వెన్నంటే ఉండి ప్రోత్సహించడదని నవాజుద్దీన్ పేర్కొన్నాడు.  ప్రస్తుతం ఆమె వయసు 25 సంవత్సరాలు.  గత ఏడు సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నట్టు నవాజుద్దీన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.