అజిత్ పై 'విశ్వాసం'తో నయనతార..

అజిత్ పై 'విశ్వాసం'తో నయనతార..

నయనతార సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా దూసుకుపోతున్నది.  వరస హిట్స్ తో వరస ఆఫర్లతో బిజీగా మారిపోయింది.  తెలుగు, తమిళ భాషల్లో వరసగా సినిమాలు చేస్తున్న ఈ లేడీ సూపర్ స్టార్, ఇప్పుడు అజిత్ విశ్వాసం సినిమాలో చేసేందుకు అంగీకరించింది.  ఒక్కరూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా అజిత్ విశ్వాసంలో నటిస్తున్నది.  

అంతేకాదు, అజిత్ సినిమా కోసం తన మిగతా సినిమాల డేట్స్ ను అడ్జెస్ట్ చేస్తున్నది.  అజిత్ పై ఉన్న గౌరవంతో తను అలా చేసినట్టు చెప్పింది. విశ్వాసంలో అజిత్ రెండు పాత్రల్లో నటిస్తున్నది.  మొదటి పాత్రకు సంబంధించిన షూట్ ఇప్పటికే కంప్లీట్ అయింది.  రెండో పాత్రకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది.  హైదరాబాద్ లో ఈ షెడ్యూల్లో నయనతార పాల్గొంటుంది.  మరోవైపు నయనతార మెగాస్టార్ చిరంజీవితో సైరా సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.