'అంజలి సీబీఐ' ట్రైలర్‌ విడుదల

'అంజలి సీబీఐ' ట్రైలర్‌ విడుదల

నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'ఇమైక్క నోడిగల్' తెలుగులో 'అంజలి సీబీఐ' పేరుతో విడుదల కానుంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ప్ర‌తినాయకుడిగా న‌టించారు. విజయ్‌ సేతుపతి, అథ‌ర్వ‌, రాశీఖ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని సిజే జ‌య‌ కుమార్ నిర్మించారు. హిప్ హాప్ త‌మిజ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను ఫిబ్రవరి 22న తెలుగులో విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు విడుదల చేశారు. 

'ఈ లోకంలో జరుగుతున్న ప్రతి మంచికి, చెడుకు.. అంతెందుకు ప్రతి కదలిక వెనుక ఓ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ దేనిమీదైనా కలగొచ్చు. డబ్బు, పదవి, కీర్తి, మనువు, మగువ మీద... కానీ నాకు ఐ లవ్‌ కిల్లింగ్‌' అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. 'నేను వాడ్ని త్వరలోనే పట్టుకుంటాను', 'ఒకే ఒక్క బులెట్‌ నీ బుర్రలోకి దించేసి వెళ్లిపోతానమ్మా' అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ను బట్టి క్రైమ్ థ్రిల్లర్ తో సినిమా ఉండనుంది. మరి ఆలస్యం ఎందుకు మీరూ చూడండి.