వివాదంపై స్పదించిన నయనతార !

వివాదంపై స్పదించిన నయనతార !

ఆడియో వేడుకలో నటుడు రాధా రవి నటి నయనతారను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.  అనేకమంది సినీ ప్రముఖులు రాధా రవి మాట్లాడిన తీరు బాగోలేదని అన్నారు.  దీంతో డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ రాధా రవిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు.  దీనిపై స్పందించిన నయనతార సాధారణంగా వివాదాలపై స్పందించనని కానీ దీనిపై స్పందించక తప్పడంలేదని స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే సుప్రీం కోర్ట్ ఆదేశాలు మేరకు మహిళలపై వేధింపులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నడిగర్ సంఘానికి విజ్ఞప్తి చేశారు.