అరవింద్ రామాయణంలో ఆమె సీత..!!?

అరవింద్ రామాయణంలో ఆమె సీత..!!?

రామాయణం భారతీయ గ్రంధాల్లో ఒకటి.  వాల్మీకి రాసిన రామాయణం తరువాత అనేక మంది రామాయణ గ్రంధాన్ని వివిధ రకాలుగా రాశారు.  అన్నింటికీ ప్రామాణిక గ్రంధం వాల్మీకి రామాయణమే.  ఈ రామాయణాన్ని బ్లాక్ అండ్ వైట్ కాలంలో సినిమాగా తీసిన సంగతి తెలిసిందే.  రామాయణం కథల ఆధారంగా ఎన్టీఆర్ ఎన్నో సినిమాలు చేశారు.  

సినిమా ప్రపంచం కలర్లోకి మారిన తరువాత రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తీసిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి.  ఇప్పుడు అల్లు అరవింద్, ప్రైమ్ మూవీస్ అధినేతలు మధు మంతెన, మల్హోత్రాలు కలిసి రామాయణాన్ని సినిమాగా తీయబోతున్నారు.  దీనికోసం ఏకంగా రూ. 1500 కోట్లు ఖర్చు చేస్తున్నారట.  మూడు భాగాలుగా 3డిలో తెరకెక్కిస్తున్నారు.  

ఇందులో సీత పాత్రను చేసే అవకాశం నయనతారకు దక్కిందని తెలుస్తోంది.  బాపు శ్రీరామా రాజ్యం సినిమాలో నయనతార సీత పాత్ర చేసి మెప్పించింది.  దీంతో రెండోసారి ఆమెకు సీత పాత్ర చేసే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.  ఇండియాలో బిజీ గా ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు.  భారీ సినిమా కాబట్టి డేట్స్ కూడా భారీగా ఇవ్వాలి.  మరి బల్క్ లో డేట్స్ ఇచ్చేందుకు నయనతార ఒకే అంటుందా చూద్దాం.