నయన్.. అందుకే ప్రియం..!!

నయన్.. అందుకే ప్రియం..!!

నయనతార సౌత్ లో భారీ చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నది.  మెగాస్టార్ తో నటించిన సైరా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది.  అక్టోబర్ 27 వ తేదీన దీపావళి సందర్భంగా విజయ్ తో నటించిన బిగిల్ రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా తరువాత వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  ఈ మూవీస్ తో పాటుగా నయనతార తమిళ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నది.  ఆయా సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి.  

సినిమాలు చేస్తున్నా, ప్రమోషన్స్  విషయంలో చాలా దూరంగా ఉంటుంది.  ఎందుకు ఏంటి అన్నది ఆమెకె తెలియాలి.  సినిమాకు అగ్రిమెంట్ చేసుకునే సమయంలో నయనతార తన కండిషన్లు చెప్తుందట.  దానికి ఒకే చెప్తేనే సినిమాలో నటిస్తుంది.  లేదంటే దూరంగా ఉంటుంది.  చాలాకాలం తరువాత నయన్ మ్యాగజైన్ కోసం ఫోజులు ఇచ్చింది.  సోషల్ మీడియాలో సైతం ఆమెకు అకౌంట్ లేదు.  ప్రమోషన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండే నయన్ కు అవకాశాలు ఎలా వస్తున్నాయి అన్నది సస్పెన్స్.