నయీమ్‌ అనుచరుడి కోసం వేట

నయీమ్‌ అనుచరుడి కోసం వేట

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్ అనుచరుడు శేషన్న కోసం తెలంగాణ, ఆంధ్ర పోలీసుల ముమ్మరంగా గాలిస్తున్నారు. కర్నూల్ జిల్లా సున్నిపెంటకు చెందిన మాజీ మావోయిస్టు  వట్టి వెంకటరెడ్డి అలియాస్ వాలి గత కొంతకాలంగా  శేషన్నకి షెల్టర్ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నయీమ్ ఎన్‌కౌంటర్‌ జరిగినప్పటి నుంచి కర్నూల్  జిల్లా బొల్లవరంలో వెంకటరెడ్డి బంధువుల ఇంట్లో ఉన్న శేషన్న ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే అక్కడికి పోలీసులు బయలుదేరగా.. శేషన్న, వెంకటరెడ్డి తప్పించుకున్నారు. ఈక్రమంలో వెంకటరెడ్డి ఇంట్లో తెలంగాణ, ఏపీ పోలీసులు సోదాలు చేసి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శేషన్న దగ్గర భారీ డంప్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.