టాలీవుడ్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ అధికారిగా ఉన్న వివేకానందరెడ్డి, 12 కేసులకు 8 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు చెబుతున్నారు. టాలీవుడ్ వ్యాపారవేత్తలు, విద్యార్థుల డ్రగ్స్ వ్యవహారంపై ఎన్టీవీతో మాట్లాడిన ఎక్సైజ్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి 12 కేసుల్లో ఉన్న అందరి శాంపిల్స్ సేకరించామని పేర్కొన్నారు. అయితే కొంతమంది టాలీవుడ్ నటుడు శాంపిల్స్ ఇవ్వడానికి వెనుకంజ వేశారన్న ఆయన శాంపిల్స్ ఇచ్చి కౌన్సెలింగ్ పొందినవారి పేర్లను ఛార్జ్‌ షీట్‌ లో పెట్టలేదని అన్నారు.

అలానే కొంత మంది నటులు పునరావాస కేంద్రంలో ఉండ లేదని ఆయన అన్నారు. కేవలం కౌన్సెలింగ్ తీసుకోని వారి పేర్లను ఛార్జ్‌షీట్‌ లో పొందుపరిచామని ఆయన అన్నారు. ఆ ఛార్జ్‌ షీట్‌ లో పేరున్న వారికి రెండేళ్ల వరకు శిక్ష పడుతుందని వివేకానంద రెడ్డి పేర్కొన్నారు. 72 మంది శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించామన్న ఆయన విదేశాల నుంచి పెద్ద మొత్తంలో టాలీవుడ్‌ కు డ్రగ్స్ చేరుకుంటున్నాయని అన్నారు. టాలీవుడ్‌ లో కొందరి వ్యక్తిగత సహాయకుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని ఆయన్ పేర్కొన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమాచారాన్ని ఎన్సీబీ ఇప్పటికే తీసుకుందని ఆయన పేర్కొన్నారు.