అజిత్ పవార్ నిర్ణయం వ్యక్తిగతం : శరద్ పవార్

అజిత్ పవార్ నిర్ణయం వ్యక్తిగతం : శరద్ పవార్

మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మలుపు తిరుగుతున్నాయి. పార్టీలు క్యాంప్ రాజకీయాలు మొదలెట్టాయి. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను జైపూర్‌కు తరలించింది. 9 మంది ఎన్సీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను హస్తిన బాట పట్టించారు బీజేపీ నేతలు. ముప్పై మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని రెబల్ నేత అజిత్‌ పవార్ ప్రకటించారు. దీంతో ఎన్సీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తమ ఎమ్మెల్యేలు చేయి జారిపోకుండా ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆ పార్టీ అధినేత శరద్ పవార్. పార్టీ శాసనశభాపక్ష నేతగా అజిత్‌ పవార్‌ను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ ఎప్పుడూ బీజేపీతో చేతులు కలపదని అన్నారు ఆ పార్టీ అధినేత శరద్ పవార్. ఎన్సీపీ ఎమ్మెల్యేలెవరూ బీజేపీకి మద్దతివ్వడంలేదన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీకే 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. అజిత్ పవార్ నిర్ణయం ఆయన వ్యక్తిగతమన్నారు. ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు శరద్ పవార్.