ఊపిరి ఆడనీకుండా చంపేశారు

ఊపిరి ఆడనీకుండా చంపేశారు

దివంగత సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, యూపీ, ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం ఎన్‌డీ తివారి కుమారుడు రోహిత్‌ తివారిది హత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎయిమ్స్‌ లో జరిపిన పోస్ట్‌ మార్టమ్‌లో రోహిత్‌ది అసహజ మరణమని తేలింది. దీంతో ఐసీసీ సెక్షన్‌ 320 కింది ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల క్రితం రోహిత్‌ను హాస్పిటల్లో చేర్చగా, ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యలు చెప్పారు. అదే హాస్పిటల్‌లో చెకప్‌ కోసం ఉన్న ఆమె తల్లికి ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది. రోహిత్‌ ముక్కు వెంట రక్తం కారుతోందని చెప్పడంతో... వెంటనే అంబులెన్స్‌ పంపి రోహిత్‌ను రప్పించారు. అయితే అప్పటికే అతను మరణించారు. పోస్ట్‌ మార్టం రిపోర్టు వచ్చిన తరవాత రోహిత్‌ది హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఇంటిలో పనిచేస్తున్నవారిని పోలీసులు విచారించారు. రోహిత్‌ను దిండుతో ఊపిరి ఆడనీయకుండా చేసి చంపేశారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.