హామీ లేకుండా రూ. 2 లక్షల రుణం?

హామీ లేకుండా రూ. 2 లక్షల రుణం?

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికారిక ఎన్డీఏలో టెన్షన్‌ పెరుగుతోంది. రైతు వ్యతిరేక పార్టీగా ముద్ర పడటంతో మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన ఎన్డీఏ.. ఇప్పుడు రైతుల ఆకర్షించేందుకు పలు పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఇపుడు రైతులకు ఇచ్చిన కిసాన్‌ కార్డుల మీద ఎలాంటి హామీ లేకుండా రైతులకు రూ. 2 లక్షల వరకు రుణం ఇవ్వాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పథకం సిద్ధం చేయడంలో కేంద్ర వ్యవసాయ, ఆర్థిక శాఖలో నీతి ఆయోగ్‌ మంతనాలు జరుపుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ ఇచ్చిన రుణ హామీకి రైతులకు నుంచి గట్టి స్పందన వస్తున్నందున... తాము కూడా అలాంటి రుణ మాఫీ పథకం పెట్టాలని బీజేపీ నేతలు గట్టిగా పట్టబడుతున్నారు. రుణ మాఫీ వల్ల ప్రయోనం లేదని ఇన్నాళ్లూ వాదించిన పార్టీ ఇప్పుడు రుణ మాఫీ అంటే చెడ్డ పేరు వస్తుందనే కోణంలో హై కమాండ్‌ ఆలోచిస్తోంది. అయితే దిగువ కేడర్‌ నుంచి వస్తున్న ఒత్తిడితో రుణ మాఫీ అంశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా నీతి ఆయోగ్‌ను ప్రధాని కార్యాలయం కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 4 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఖాతాలు ఉన్నాయి. వీటి ద్వారా ఇప్పటి వరకు 2.37 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం లక్ష రూపాయల లోపు రుణాలకు రైతుల నుంచి ఎలాంటి హామీని కోరడం  లేదు. ఈ పరిమితిని రూ. 2 లక్షలకు పెంచాలని కేంద్రం యోచన. అలాగే కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఖాతాలను రూపే ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డు కిసాన్‌ కార్డులుగా మార్చాలని కూడా ప్రభుత్వం కోరుతోంది. దీంతో రైతులకు చాలా సులభంగా నిధులు అందుబాటులోకి వస్తాయని, చీటికి మాటికి బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

ఫైసల్‌ బీమాకు మెరుగులు?
ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన నవ్వులపాలైందని బీజేపీ నేతలు అంటున్నారు. చాలా నామమాత్రపు సొమ్ము వస్తున్నందున.. పుండు మీద కారం చెల్లించనట్లుందని పార్టీ వర్గాలు అంటున్నారు. దీనివల్ల లాభంకన్నా నష్టమే జరుగుతోందని ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో బీమా పథకం కింద కాస్త ఎక్కువ సొమ్ము అందేలా చూడాలని, దీనికి విధివిధానాల్లో మార్పులకు గల అవకాశాలను పరిశీలించాలని నీతి ఆయోగ్‌ను కోరారు.