తొలి ఫలితాల్లో ఎన్డీఏ ఆధిక్యం..
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్స్‌ను లెక్కించారు అధికారులు. కాగా, తొలి ఫలితాల్లో దేశంలో అధికారంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్స్‌లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది ఎన్డీఏ. తాజా సమాచరం ప్రకారం 48 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉండగా... 24 స్థానాల్లో యూపీఏ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక 4 స్థానాల్లో ఇతరులు లీడర్లో ఉన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)