నెక్లెస్ రోడ్డు దాడి ఘటనలో యువకుడు మృతి

నెక్లెస్ రోడ్డు దాడి ఘటనలో యువకుడు మృతి

రెండు రోజుల క్రితం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఓ ప్రేమజంట జరిపిన దాడిలో గాయపడ్డ సాయిసాగర్ శనివారం మృతి చెందాడు. పోలీస్‌స్టేషన్‌లోనే సాయి సాగర్‌పై మోబిన్‌ పిడి గుద్దులతో దాడి చేశాడని, సీసీ పుటేజ్‌ ఇవ్వకుండా పోలీసులు అతనికి సపోర్ట్ చేస్తున్నారని మృతుడి స్నేహితులు అంటున్నారు. ఇప్పటికే మోబిన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతనిపై 16 కేసులు నమోదు అయినట్లు, మిర్యాలగూడలో కేసులతో పాటుగా పీడీ యాక్ట్‌లో మోబిన్‌ అరెస్టయ్యాడు. బర్త్‌డే పార్టీ చేసుకోవడానికి నెక్లెస్‌రోడ్డుకు వెళ్లిన సాయి సాగర్‌ స్నేహితుల బృందం.. అక్కడి ఓ ప్రేమజంటతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు వర్గాలకు చెందిన నలుగురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, అప్పటివరకు బాగానే ఉన్న సాయిసాగర్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే చికిత్స పొందుతున్న సాయి సాగర్‌ మృతి చెందాడు. సాయి సాగర్‌కు ఇరవై రోజుల కిత్రమే వివాహమైనట్లు స్నేహితులు పేర్కొన్నారు.