ప్రపంచం ముందు పెను సవాల్... ఇలానే వదిలేస్తే వినాశనమే...!!

ప్రపంచం ముందు పెను సవాల్... ఇలానే వదిలేస్తే వినాశనమే...!!

ప్రపంచం ముందు ప్రస్తుతం పెను సవాళ్లు ఉన్నాయి.  కరోనా ప్రపంచంలో వేగంగా విస్తరిస్తోంది.  ముఖ్యంగా నాలుగు దేశాల్లో ఈ వైరస్ ప్రస్తుతం విలయతాండవం చేస్తున్నది.  గత రెండు వారల క్రితం వరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన వైరస్ ఇప్పుడు తిరిగి వేగంగా విస్తరించడం  మొదలుపెట్టింది అమెరికాలో.  రోజుకు అక్కడ 40 50నుంచి  వేల వరకు  నమోదవుతున్నాయి. 

ఈ స్థాయిలో కేసులు నమోదవడం అంటే మాములు విషయం కాదు.  ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నా ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలు బయట తిరుగుతున్నారు. ఇదే ఇప్పుడు ఆ దేశానికి పెను సవాల్ గా మారింది.  అమెరికా తరువాత అదే స్థాయిలో వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశం బ్రెజిల్.  బ్రెజిల్ లో  కూడా  రోజుకు 40 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి.  అక్కడి ప్రభుత్వం మొదట్లో కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.  చేతులు కాలాక ఆకులు పట్టుకువడం అనే  చందాన బ్రెజిల్ ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది.  ఇండియా పరిస్థితి ఎలా ఉన్నదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  రోజు రోజుకు ఇండియాలో కేసులు భారీగా  పెరుగుతున్నాయి.  రోజు 20వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు రష్యాలో సైతం భారీగానే ఉన్నాయి.  కానీ, ఈ దేశంలో వ్యాప్తి కొంతవరకు తగ్గుముఖం పట్టింది.   ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో 51% కేసులు ఈ నాలుగు దేశాల్లోనే ఉన్నాయి.   కరోనాను వీలైనంత త్వరగా కట్టడి చేయకుంటే వినాశం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.