అమితాబ్ భార్యగా నీనాగుప్తా

అమితాబ్ భార్యగా నీనాగుప్తా

'బదాయి హో' లాంటి సినిమాలో ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని పర్ఫామెన్స్ ప్రదర్శించింది నీనా గుప్త. అయితే, 2018లో ఆమె నటనని అమితాబ్ బచ్చన్ ఎంతగానో మెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు తన ఫేవరెట్ స్టార్ బిగ్ బి పక్కన కీలక పాత్రలో నటించబోతోంది సీనియర్ యాక్ట్రస్. ఏక్త్ కపూర్ నిర్మిస్తోన్న 'గుడ్ బై' సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన భార్య క్యారెక్టర్ లో నీనా గుప్త కనిపించబోతోంది. ఇది తనకు కల నిజమైనట్టుగా ఉందని నీనా అంటోంది. గతంలో బచ్చన్ తో ఆమె ఎప్పుడూ నటించలేదు. అందుకే, వారిద్దరి కాంబినేషన్ తెరపై చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, 'గుడ్ బై'లో మన రశ్మిక మందణ్ణ కూడా కనిపించబోతోంది. ఆమే సినిమాలో హీరోయిన్. కాగా 'గుడ్ బై' దర్శకుడు వికాస్ బాల్. 'క్వీన్' లాంటి సెన్సేషనల్ సినిమా తీసిన టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన!