కొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన భారత జావెలిన్ త్రోయర్...
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ఇండియన్ గ్రాండ్‌ప్రిలో భాగంగా నీరజ్ ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న రికార్డునే మళ్ళీ తిరగ రాశాడు. కరోనా వైరస్ కారణంగా 2020లో ఒక్క టోర్నీలో కూడా పాల్గొనని నీరజ్.. గ్రాండ్ ప్రిలో ఐదో ప్రయత్నంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 'కొవిడ్-19 కారణంగా గతేడాది పోటీలకు దూరమయ్యాడు. దీంతో ప్రాక్టీస్‌కు కూడా ఇబ్బంది కలిగింది. అయినా ఒలింపిక్ పతకం పట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని పేర్కొన్నాడు నీరజ్. చూడాలి మరి ఇదే ప్రతిభను నీరజ్ ఒలింపిక్ గేమ్స్ లో చూపిస్తాడా... అనేది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)