ఒడిశాలో 20న 'నీట్‌'

ఒడిశాలో 20న 'నీట్‌'

ఒడిశాలో ఈ నెల 20న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)జరగనుంది. ఈమేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఈనెల 5వ తేదీన ఈ పరీక్ష జరిగినప్పటికీ తుపాన్‌ కారణంగా ఒడిశాలో వాయిదా పడింది. 20వ తేదీకి సంబంధించి త్వరలోనే అడ్మిట్‌ కార్డులను విడుదల చేస్తామని, గతంలో కేటాయించిన పరీక్ష కేంద్రాలే కొనసాగుతాయని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇక.. దేశ వ్యాప్తంగా నిన్న జరిగిన 'నీట్‌'కు దాదాపు 13 లక్షల మంది హాజరయ్యారు.