నీట్ లో మెరిసిన తెలంగాణ విద్యార్ధిని

నీట్ లో మెరిసిన తెలంగాణ విద్యార్ధిని

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా.. 14,10,754 మంది పరీక్షకు హాజరయ్యారు. రాజస్తాన్‌కు చెందిన నలిన్‌ ఖండేల్‌వాల్‌ 701 మార్కులు సాధించి ఆల్‌ ఇండియా మొదటి ర్యాంక్‌ సాధించగా, తెలంగాణకు చెందిన మాధురి రెడ్డి 695 మార్కులతో 7వ ర్యాంక్‌ సాధించింది. దేశవ్యాప్తంగా అమ్మాయిల్లో మొదటి ర్యాంకు సాధించింది. అలాగే ఏపీ విద్యార్థిని కురేషే హస్రా 16వ ర్యాంకు దక్కించుకుంది. ఫలితాల్లోనూ రాజస్తాన్‌ మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో 2019–20 వైద్య విద్య సంవత్సరంలో ప్రవేశాలకు గత నెల 5న నీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.