నీట్ ఫలితాలుః టాప్ లేపిన తెలుగమ్మాయిలు

నీట్ ఫలితాలుః టాప్ లేపిన తెలుగమ్మాయిలు

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసి వెబ్‌సైట్‌లో పెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న దేశవ్యాప్తంగా 154 పరీక్ష కేంద్రాల్లో  నీట్‌ పరీక్ష నిర్వహించారు. ఈసారి నీట్ ఫలితాల్లో తెలుగమ్మాయిలు టాప్ లేపారు. దేశవ్యాప్తంగా అమ్మాయిల్లో తెలంగాణకు చెందిన మాధురి రెడ్డి(695) మొదటి స్థానంలో నిలవగా, ఏపీకి చెందిన ఏపీ విద్యార్థిని కురేషే హస్రా(690) మూడో స్థానంలో నిలిచింది. మొత్తం ర్యాంకుల ప్రకారం చూసుకుంటే వీరు 7వ, 16వ స్థానాలు దక్కాయి. దేశవ్యాప్తంగా 56.27 శాతంతో 7,97,042 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణతా శాతం 56.27గా నమోదైంది. ఏపీలో 72.55 శాతంతో 39,039 మంది, తెలంగాణలో 68.88శాతంతో 33,044 మంది ఉత్తీర్ణులయ్యారు.