షాక్: స్టేజి మీదనే లేడీ జడ్జిని ముద్దుపెట్టుకున్నాడు..  

షాక్: స్టేజి మీదనే లేడీ జడ్జిని ముద్దుపెట్టుకున్నాడు..  

దేశంలో ఇండియన్ ఐడల్ కు ఓ గుర్తింపు ఉన్నది.  ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ రియాల్టీ షోను వేలాదిమంది వీక్షిస్తుంటారు. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ 11 సీజన్ జరుగుతున్నది  ఈ షోలో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి.  ఈ షో న్యాయ నిర్ణేతలుగా అను మాలిక్, విశాల్‌ దడ్లాని, నేహా కక్కర్ లు వ్యవహస్తిస్తున్నారు.  రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో ఊహించని సంఘటన జరిగింది.  ఈ షోలో ఓ కంటెస్టెంట్ పాట పాడాడు.  అనంతరం తాను ఎవరో గుర్తుపట్టాలని నేహా కక్కర్ ను కోరాడు.  

ఆ లేడీ జడ్జి వేదిక మీదకు వెళ్ళింది. అలా వెళ్లిన ఆమెకు ఆ కంటెస్టెంట్ కొన్ని బహుమతులు ఇచ్చాడు.  ఆశ్చర్యానికి లోనైనా నేహా కక్కర్ అతడిని ఆప్యాయంగా కౌగిలించుకొని కృతజ్ఞతలు చెప్పింది.  అంతలో ఊహించని షాక్... ఆ కంటెస్టెంట్ ఆమె బుగ్గలపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.  ఈ ఊహించని సంఘటనతో ఆమె మరోసారి షాక్ అయ్యింది.  వెంటనే అక్కడి నుంచి నేహా వెళ్ళిపోయింది.  ఆ కంటెస్టెంట్ ను సైతం అక్కడి నుంచి బయటకు పంపించేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.