నేల టిక్కెట్టు సెన్సార్ రిపోర్ట్

నేల టిక్కెట్టు సెన్సార్ రిపోర్ట్
మాస్ మహారాజ హీరోగా నటించిన నేల టిక్కెట్టు సినిమా ఈనెల 25 వ  రిలీజ్ కాబోతున్నది.  ఇటీవలే ఆడియో విడుదలైన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది.  సెన్సార్ బోర్డు నేల టిక్కెట్టుకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.  రవితేజ యాక్టింగ్ అద్భుతంగా ఉందని సెన్సార్ బోర్డు టాక్.  కథ, కథనాలు ఆకట్టుకున్నాయని టాక్ వినిపిస్తోంది.  డైలాగ్స్ థియేటర్స్ లో పేలతాయని సెన్సార్ టాక్.  చాలా కాలం తరువాత రవితేజ నుంచి మంచి సినిమా వస్తోందని సెన్సార్ టాక్.  
 
సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక శర్మ రవితేజకు జోడిగా నటిస్తోంది.  జగపతి బాబు విలన్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది.