'బంగార్రాజు' ఉంటుందా?

'బంగార్రాజు' ఉంటుందా?

'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్ కు పరిచయమయ్యాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. రెండో సినిమా 'రా రండోయ్ వేడుక చూద్దాం' కూడా అక్కినేని కాంపౌండ్ లోనే చేశారు. ఈ రెండు దర్శకుడిగా కళ్యాణ్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ ఈ రెండు విజయాలను మర్చిపోయేలా చేసింది అతడి తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా 'నేల టికెట్టు'. ఈ సినిమా కథ కానీ అతడు ఆవిష్కరించిన విధానం గానీ ఏ ఒక్కరినీ ఆకట్టుకోలేకపోయింది. అసలు కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమానేనా అనే సందేహాలు కలిగాయి. 

అయితే ఈ సినిమా తరువాత నాగార్జున హీరోగా 'బంగార్రాజు' సినిమా చేయాలనుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. చాలా నమ్మకంగా రెండు, మూడు నెలల్లో బంగార్రాజు మొదలవుతుందని చెప్పాడు. కానీ 'నేల టికెట్టు' సినిమా రిజల్ట్ తో ఇప్పుడు కళ్యాణ్ కు 'బంగార్రాజు' టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం నాగార్జున రిస్క్ తీసుకోవడానికి సిద్ధం లేడు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణ్ కృష్ణను నమ్మి సినిమా చేస్తాడనుకోవడానికి అవకాశం లేదనే చెప్పాలి. మరి కళ్యాణ్.. నాగ్ కోసం ఎదురుచూస్తాడో లేక మరో హీరోతో సినిమా చేస్తాడో చూడాలి!