రవితేజ సినిమా మరింత ఆలస్యం!

రవితేజ సినిమా మరింత ఆలస్యం!
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 'నేల టిక్కెట్టు' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మొదట ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. నిజానికి సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే.. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న మాళవిక శర్మకు షూటింగ్ సమయంలో కాలికి దెబ్బ తగిలింది. నరానికి గట్టిగా తగలడంతో కొద్దిరోజుల పాటు కాలిపై ఎలాంటి భారం మోపకూడదని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుందని సమాచారం. దీంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరగలేదట. ఎలా చూసుకున్నా.. సినిమా మే నుండి జూన్ కు వాయిదా వేయడం ఖాయమని అంటున్నారు.