నేల టిక్కెట్టు బిజినెస్ ఏ రేంజ్ లో ఉందంటే..!

నేల టిక్కెట్టు బిజినెస్ ఏ రేంజ్ లో ఉందంటే..!
మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న నేల టిక్కెట్టు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది.  మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ఉన్నది.  చుట్టూ జనం, మధ్యలో మనం, నేల టిక్కెట్ గాళ్ళతో పెట్టుకోకు.. నేల నాకించేస్తారు వంటి డైలాగులు పేలాయి.  చాలా కాలం తరువాత రవితేజ చేస్తున్న పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  సినిమా టైటిల్ తోనే సగం హిట్ మార్కులు కొట్టేశాడు రవితేజ.  
 
సోగ్గాడే చిన్ని నాయన, రా రండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు పెరిగాయి.  కొత్త అమ్మాయి మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్.  మాస్ ను ఆకట్టుకునే విధంగా ఉన్న టైటిల్ తో పాటు ట్రైలర్ కూడా అదిరిపోవడంతో సినిమా మినియం గ్యారెంటీ అంటున్నారు.  ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లోనే జరిగినట్టు తెలుస్తోంది.  30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను ఇప్పటికే 26 కోట్లకు పైగా బిజినెస్ చేసుకుందట.  సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వస్తే.. లాభాల బాట పట్టడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.