నేల టిక్కెట్టు బాగానే తెగింది

నేల టిక్కెట్టు బాగానే తెగింది

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన `నేల టిక్కెట్‌` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. మ‌రి కాసేప‌ట్లో ఈ సినిమా టాక్ రివీల్ కానుంది. ర‌వితేజ‌, క‌ళ్యాణ్, రామ్‌ బృందం ఈ సినిమా విజ‌యంపై పూర్తి ధీమాని క‌న‌బ‌రిచారు. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్త థియేట్రిక‌ల్ రిలీజ్ హ‌క్కులు 22 కోట్ల‌కు విక్ర‌యించారు. ఓవ‌రాల్‌గా సుమారు 48 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం.

ఏరియా వైజ్ బిజినెస్ వివ‌రాలు పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణ ఓవ‌రాల్‌గా క‌లుపుకుని 18.55కోట్ల బిజినెస్ సాగింది. క‌ర్నాట‌క 1.45కోట్లు, ఓవ‌ర్సీస్ 1.5 కోట్లు బిజినెస్ చేసింది. నైజాం-6.6కోట్లు, సీడెడ్ -3.05కోట్లు, ఉత్త‌రాంధ్ర‌-2.15కోట్లు, తూ.గో జిల్లా-1.45కోట్లు, ప‌.గో జిల్లా-1.25కోట్లు, కృష్ణ‌-1.45కోట్లు, గుంటూరు-1.8కోట్లు, నెల్లూరు-80ల‌క్ష‌లు, ఇత‌ర‌చోట్ల‌-50ల‌క్ష‌లు బిజినెస్ పూర్త‌యింది. శాటిలైట్ హ‌క్కుల‌కు 13కోట్లు, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ 12కోట్లు, ఇత‌ర మార్గాల్లో 1కోటి వ‌చ్చింది. ఓవ‌రాల్‌గా 48కోట్ల మేర ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం.