'నేల టిక్కెట్టు' టీజ‌ర్ అప్‌డేట్‌

'నేల టిక్కెట్టు' టీజ‌ర్ అప్‌డేట్‌
మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. మాళ‌వికా శ‌ర్మ క‌థానాయిక‌. 'సోగ్గాడే చిన్ని నాయ‌నా', 'రారండోయ్ వేడుక చూద్దాం' ఫేమ్‌ క‌ల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా వ‌చ్చే నెల 25న విడుదలవనుంది. ఇక.. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 22వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా టైటిల్‌ లోగోను కూడా విభిన్నంగా 'టికెట్‌' రూపంలో ప్రజెంట్‌ చేశారు. వెల రూ.10, టికెట్‌ నంబర్‌ 420గా చూపించారు. Nela Ticket Movie (2)