అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటాం 

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటాం 

ఆగ్రిగోల్డ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ స్కామ్ కాంగ్రెస్ హయాంలో జరిగిందని తెలిపారు.  నెల్లూరు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు సోమిరెడ్డి, అమర్నాధ్ రెడ్డి, నారాయణ... ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.  జగన్ పై దాడి చేసిన వ్యక్తి వైసీపీ అభిమానే అని మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం పోలీసు వ్యవస్థనే అవమానించడమే అని ఆయన విమర్శించారు. సినీ నటుడు శివాజీ చెప్పినట్టే జరుగుతుందని నారాయణ పేర్కొన్నారు. పార్టీ బలోపేతంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇంచార్జ్ మంత్రి అమర్నాధ్ రెడ్డి అన్నారు.  సాగు,తాగునీటి సమస్య పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల 10న సీఎం అధ్యక్షతన ధర్మపోరాట దీక్ష చేస్తామని తెలిపారు అమర్నాథ్ రెడ్డి. సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.