విద్యార్థినిని వేధిస్తున్న ప్రొఫెసర్‌

విద్యార్థినిని వేధిస్తున్న ప్రొఫెసర్‌

నెల్లూరు మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థినిని అక్కడి ఫ్రొఫెసర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ బయటి వ్యక్తి ప్రొఫెసర్ పై దాడి చేశాడు.  దీంతో మెడికల్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడి మెడికల్‌  కళాశాలలో ఫ్రొఫెసర్ చంద్ర శేఖర్ గత కొంత కాలంగా లైంగిక వేధిస్తున్నాడని  ఫైనల్ ఇయర్ చదువుతున్న దీప్తి అనే విద్యార్థిని ఆరోపిస్తోంది. తన దూరపు బంధువు అయిన ప్రజ్ఞ అనే వ్యక్తికి ఈ విషయాన్ని తెలిపింది.  కళాశాలకు చేరుకుని ప్రజ్ఞ....సమావేశంలో ఉన్న ప్రొఫెసర్ పై దాడికి దిగాడు. అడ్డు వచ్చిన వారిపై కూడా దాడి చేశాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రజ్ఞ ను అదుపులోకి తీసుకున్నారు.  ఈ మెడికల్ కళాశాలలో ఇలాంటి ఆరోపణలు తరచుగా వస్తున్నాయని, అయినా  పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.