వాట్సాప్ లో చాటింగ్... ఆపై  యువతి ఆత్మహత్య... ఇదే కారణం...!!

వాట్సాప్ లో చాటింగ్... ఆపై  యువతి ఆత్మహత్య... ఇదే కారణం...!!

నెల్లూరుకు చెందిన రమ్య అనే ఇంట్లోనే సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  కూతురు ఆత్మహత్యకు ముగ్గురు యువకులు కారణం అని, వారి వేధింపుల వలనే ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు విద్యార్థిని మొబైల్ ను  స్వాధీనం చేసుకొని పరిశీలించగా అనేక విషయాలు బయటకు వచ్చాయి.  

విద్యార్థిని రమ్య చనిపోయే ముందు  శివ అనే వ్యక్తితో చాటింగ్ చేసింది.  తనతో మాట్లాడాని చాట్ చేసిన అతని నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.  అయినప్పటికీ ఎలాంటి రిప్లై లేకపోవడంతో, ఆ యువతి మరో స్నేహితుడు భార్గవ్ కి కూడా ఇదే విషయాన్ని మెసేజ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది.  వాట్సాప్ మెసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.