నెల్సన్ మండేలా చిన్న కుమార్తె ఇకలేరు

నెల్సన్ మండేలా చిన్న కుమార్తె ఇకలేరు

నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా కుమార్తె జిండ్జీ(59) మండేలా కన్నుమూశారు. డెన్మార్క్‌లో సౌతాఫ్రికా రాయబారిగా పనిచేస్తున్న ఆమె అకస్మాత్తుగా మరణించారు.జిండ్జీ మృతి చెందినట్లు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. ఈ రోజు ఉదయం జోహన్నెస్‌బర్గ్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంది. అయితే ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. నెల్సన్‌ మండేలాకు మొత్తం ముగ్గురు భార్యలు ఆరుగురు సంతానం. 20 మంది మనువలు, మనవరాళ్లు ఉన్నారు. నెల్సన్‌ మండేలా- రెండో భార్య విన్నీ మడికిజెలాకు పుట్టిన సంతానం జిండ్జీ.