సచిన్‌ రికార్డు బద్దలు...

సచిన్‌ రికార్డు బద్దలు...

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ రికార్డు బద్దలు అయింది. 29ఏళ్ల కిందట సచిన్‌ సృష్టించిన రికార్డను నేపాలీ యువ క్రికెటర్‌ రోహిత్‌ పౌడెల్‌ బద్దలు కొట్టాడు. శనివారం నేపాల్‌, యూఏఈ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ పౌడెల్‌ అర్ధ సెంచరీ చేసాడు. దీంతో అతి చిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్‌ పేరిట ఉంది. సచిన్‌ 16ఏళ్ల 213 రోజుల వయసులో అర్ధ సెంచరీ చేస్తే.. రోహిత్‌ 16ఏళ్ల 146 రోజులు వయసులో అర్ధ సెంచరీ చేసాడు. పాకిస్థాన్ విధ్వంసక ఆటగాడు అఫ్రిది 16ఏళ్ల 217 రోజుల వయసులో శ్రీలంకపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే 37 బంతుల్లో సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు.

పురుషుల క్రికెట్‌లో రోహిత్‌ది రికార్డు. అయితే క్రికెట్‌ ప్రపంచంలో రోహిత్‌ కన్నా అతి తక్కువ వయసులో అర్ధశతకం చేసిన రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా క్రికెటర్‌ జోహ్‌మరి లాగ్టెన్‌బర్గ్‌పై ఉంది. జోహ్‌మరి 14 ఏళ్ల వయసులోనే టెస్టు, వన్డేలలో అర్ధ శతకాలు చేసింది.