విరాట పర్వం డిజిటల్ రైట్స్ సోంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. ఎంతకో తెలుసా..?

విరాట పర్వం డిజిటల్ రైట్స్ సోంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. ఎంతకో తెలుసా..?

రానా దగ్గుపాటి, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాట పర్వం. నక్సల్ లీడర్ రవన్న కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, టీజర్, గ్లింప్స్ ఇలా అన్ని కూడా సినిమాపై ఆసక్తిని అధికం చేశాయి. ఈ సినిమాలో సీనియర్ నటి ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం తెలుగు ఓటీటీ సంస్థ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా పోటీ పడ్డాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ అధిక మొత్తం చెల్లించడంతో మూవీ మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌ వారితో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయంలో ప్రస్తుతం ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.11 కోట్లు చెల్లించిందని, అంతేకాకుండా సినిమా విడుదలైన 45 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ ఉండేలా ఒప్పందం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.