టెలివిజ‌న్‌పై డిజిట‌ల్ ఆధిప‌త్యం

టెలివిజ‌న్‌పై డిజిట‌ల్ ఆధిప‌త్యం

ఇన్నాళ్లు బుల్లితెర అని మాట్లాడుకునేవాళ్లం. ఇక‌మీద‌ట డిజిట‌ల్ తెర అని మాత్ర‌మే మాట్లాడుకునే స‌న్నివేశం రాబోతోందా?  అర‌చేతి బుల్లిపెట్టెలో ప్ర‌పంచం ఇమిడిపోయిన నేటి సాంకేతిక విప్ల‌వం పెను మార్పుల‌కు కార‌ణ‌మ‌వుతోందా?  డిజిట‌ల్ వినోదం వీక్ష‌ణ అంత‌కంత‌కు పెరుగుతోందా? అంటే ఇదిగో ఇదే సాక్ష్యం. 

ప్ర‌తిష్ఠాత్మ‌క అమెరిక‌న్ టెలివిజ‌న్ అందించే  ఎమ్మీ అవార్డ్స్ అంటే బుల్లితెర విభాగంలో ఎప్పుడూ హెచ్‌బివో చానెల్ లీడ్ చేసేది. ఈసారి సీన్ మొత్తం ఛేంజ్ అయిపోయింది. హెచ్‌బీవో స్థానంలో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ రాజ్య‌మేలుతోంది. 18 ఏళ్ల ఎమ్మీ పుర‌స్కారాల చ‌రిత్ర‌లో ఇదో కొత్త ప‌రిణామం. టీవీని పూర్తిగా డిజిట‌ల్ మాధ్య‌మం డామినేట్ చేస్తోంద‌న‌డానికి ఇదే సాక్ష్యం. ఇదో కొత్త ప‌రిణామం.. టీవీ చానెళ్ల‌కు యూట్యూబ్‌, వెబ్ సిరీస్‌ల రూపంలో కొత్త థ్రెట్‌కి ఇది సింబాలిక్ అని విశ్లేషిస్తున్నారు. ఎమ్మీ 2018 అవార్డుల్లో అన్ని చానెళ్ల‌ నుంచి 108 నామినేష‌న్లు ఉంటే, ఓన్లీ నెట్‌ఫ్లిక్స్ నుంచి 112 నామినేష‌న్లు వెళ్లాయంటే ఇది దేనికి సూచిక‌?