విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని డిమాండ్.. కారణం అదే..

విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని డిమాండ్.. కారణం అదే..

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అతడికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అన్ని పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరిని మెప్పించాడు. ఇటీవల విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించిన మాస్టర్ సినిమా విడుదలయింది. ఊహించిన స్థాయిలో లేక పోయిన విజయ్‌కి మాత్రం విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఇటువంటి విలక్షణ నటుడు నేడు తన జన్మదిన వేడుకను జరుపుకుంటున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా విజయ్ మూడు రోజుల ముందే తన తూన సినిమా సెట్స్‌లో కేక్ కట్ చేశాడు. దాంతో నేటిజన్స్ అతడిని అరెస్ట్ చేయాలని కోరారు. అదేంటి కేక్ కట్ చేస్తే నేరమేంటని అనుకుంటున్నారు. కేక్‌ను చిన్న కత్తితో కట్ చేస్తే పర్వాలేదు. కానీ విజయ్ పెద్ద తల్వార్‌తో కేక్‌ కటింగ్ చేశాడు. ఇదివరకు ఇదే తరహాలో కొందరు తల్వార్‌తో కేక్ కటింగ్ చేశాడని చెన్నై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఓ సెలబ్రిటీ చేస్తే వదిలేస్తార. అంటూ విజయ్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి వెంటనే స్పందించిన విజయ్ అందిని క్షమాపణ కోరాడు. ఈ అంశంపై విజయ్ ట్వీట్ కూడా చేశాడు. ‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను విష్ చేసిన సినీ ప్రముఖులు, అభిమానులకు నా ధన్యవాదాలు. మూడు రోజులు క్రితం పూట్టిన రోజు సందర్భంగా తీసుకున్న ఫోటో ప్రస్తుతం వివాదాలకు దారతీసింది. నేను చేస్తున్న నూతన చిత్రం పెద్ద కత్తి కీలకంగా నడుస్తోంది. ఆ కారణంగానే నేను నా పుట్టిరోజు వేడుకలో కేక్‌ని తల్వార్‌తో కట్ చేశాను. అయితే దీన్ని అనేక మంది తప్పుబట్టారు. మరోసారి ఇలా జరకుండా జాగ్రత్త పడతాను. తెలిసీ తెలీకుండా ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే నన్ను క్షమించండ’ని విజయ్ తమిళంలో ట్వీట్ చేశాడు. మరి దీనిపై నెటిజన్లు ఏమని స్పందిస్తారో చూడాలి.