బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ కంటెస్టంట్ !

బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ కంటెస్టంట్ !

నాగార్జున హోస్ట్ ఇటీవ‌ల ప్రారంభ‌మైన టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ఏడో వారానికి చేరుకుంది.ఇప్ప‌టికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా. ఆరో వారంలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ కుమార్ సాయి కూడా దుకాణం సర్దుకుని బయటకు వచ్చాడు. అయితే కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వ‌డంపై ప్రేక్ష‌కుల నుండి తొలుత తీవ్ర వ్య‌తిరేఖ‌త వ్య‌క్తం అయింది. ఆ విషయం పక్కన పెడితే అతను ఎలిమినేట్ కావడానికి ముఖ్య కారణాలు చూస్తే అతను దాదాపు ప్రతి వారం నామినేట్ అవుతున్నాడు.

ఇక ఇంట్లో మిగతా వాళ్ళతో పోలిస్తే కుమార్ పెద్దగా ఫోకస్ అయ్యింది లేదు. వెండితెరపై కమెడియన్ గా క్లిక్కయినప్పటికి బిగ్ బాస్ లో మాత్రం ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు కూర్చుంటూ ఉండే వాడాడు. అతన్ని తెచ్చిందే ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఈయన ఇంకేదో చేయడానికి ట్రై చేశాడు. పైగా ఫిజికల్ టాస్క్ లలో కూడా కుమార్ సాయి పెద్దగా యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు. అంతే కాదు అనవసరంగా ఎదుటివాళ్ళపై గొడవలు పడుతున్నాడనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అదీ కాక మిగతా వాళ్ళు ఎదో ఒక విధంగా బిగ్ బాస్ కెమెరాలను ఎట్రాక్ట్ చేస్తుండగా కుమార్ సాయి మాత్రం మ్మ్ అంటూ ఫేస్ పెట్టుకుని ముచ్చట్లతోనే టైం అంతా కిల్ చేశాడు.

ఆయన్ని తెచ్చిందే కామెడీ యాంగిల్ కోసం అయితే  ముఖ్యంగా ఆ యాంగిల్ లోనే ఈయన ఫెయిల్ అయ్యాడు. ప్రేక్షకులు మోనాల్ విషయంలో ఈయన బెటర్ అనుకున్నారు కానీ, కుమార్ సాయి ఈ వారం నామినేట్ చేసిన హౌస్‌మేట్స్‌లో అతి తక్కువ ఓట్లను పొందినట్లు సమాచారం. నేను డల్ గా ఏమీ లేను. నా వ్యక్తిత్వమే అది అని ఆయన ఎన్ని కవర్ డ్రైవ్ లు ఇప్పుడు చేసుకుంటున్నా , అసలు లోపలి పంపిందే ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఈయన ఎందుకో లోపల ఇమడలేకపోయారని చెప్పచ్చు. ఒక ఆర్టిస్ట్ గా నేను ఏదైనా స్కిట్ ఇస్తే నేను కామెడీ చేస్తాను.

అంతే కానీ, రోజూ అదేపనిగా కామెడీ చేస్తూ గడపలేను. ఇప్పుడు డాన్స్ చేయాలి.. యాక్ట్ చేయాలి ఇలా ఏదైనా టాస్క్ వచ్చినపుడు నేను అందులో ఇమిడిపోతానని చెబుతున్నాడు ఆయన. కానీ, ఆయన మాటల్లో పస లేదన్నదనేది మాత్రం అర్ధం అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో కుమార్ సాయికి ఇచ్చిన వీడ్కోలు అంత వరస్ట్ వీడ్కొలు ఇంకా ఎవరికీ లభించలేదు మరి. అందుకే ఈయన సపోర్టర్స్ బిగ్ బాస్ ని , నాగార్జునని ఆడిపోసుకుంటుంటే, కొందరు మాత్రం బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ కంటెస్టంట్ ఈయనే నని అంటున్నారు.