కరోనా అనుమానంతో కాల్చేశారని... ఆ అధ్యక్షుడిపై నెటిజన్లు ఫైర్... 

కరోనా అనుమానంతో కాల్చేశారని... ఆ అధ్యక్షుడిపై నెటిజన్లు ఫైర్... 

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇబ్బంది పెడుతున్నది.  ఈ కరోనా దెబ్బకు రోజుకు వందలాది మంది మరణిస్తున్నారు.  అధికారికంగా చెప్తున్న లెక్కలకు, అక్కడ అనధికారిక లెక్కలకు చాలా తేడా ఉంటున్నది.  ఇది వేరే విషయం అనుకోండి.  అసలు విషయం ఏమిటంటే, కరోనాను ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం చాలా కష్టపడుతున్నది. 

కానీ, కంట్రోల్ కావడం లేదు.  అలా అని చేతులు ముడుచుకొని కూర్చోలేదు.  తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.  అయితే, ఉత్తర కొరియా మాత్రం ఈ విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తిని ఆ దేశం కాల్చి చంపింది.  దీనిని ఆ దేశం సమర్ధించుకున్నది కూడా.  కరోనా తమ దేశంలోకి అడుగుపెట్టలేదని అంటోంది.  కరోనా వస్తే చికిత్స చేయాలి అంతేగాని, ఇలా కాల్చి చంపుతారా అని నెటిజన్లు  ప్రశ్నిస్తున్నారు.  

 కరోనా ఏదో అధ్యక్షుడు కిమ్ కు వస్తే బాగుంటుందని, ఆ దేశం అప్పుడైనా బాగుపడుతుందని అంటున్నారు.  ఇటీవలే ఓ వ్యక్తి చైనా వెళ్లి వచ్చాడు.  అలా వచ్చిన ఆ వ్యక్తిని దేశం దూరంగా పెడుతూ వచ్చింది.  పైగా అతను దగ్గుతుండటంతో ఆ వ్యక్తిని అక్కడి అధికారులు ప్రత్యేకంగా ఓ ప్లేస్ లో ఉంచారు.  బయటకు రాకుండా బంధించారు.  కానీ, అతను బటయకు రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి కాల్చి చంపారు.  ఇది అక్కడ సంచలనంగా మారింది.