మాల్యాతో భేటీ కాలేదు కానీ...

మాల్యాతో భేటీ కాలేదు కానీ...

దేశం విడిచి వెళ్ళే ముందు తాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యానని విజయ్ మాల్యా చెప్పడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఆయన తన వివరణ ఇచ్చారు. 2014 నుంచిచ విజయ్ మాల్యాకు తాను ఎప్పుడూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయనతో భేటీ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదని మంత్రి అన్నారు.  అయితే రాజ్యసభ సభ్యునిగా  అపుడపుడు పార్లమెంటు  హౌస్ లో కలిసే అవకాశం ఉంటుందని, దాన్ని విజయ్ మాల్యా దుర్వినియోగం చేస్తూ... తాను తన రూమ్ కు వెళుతున్న సమయంలో  తనతో మాట్లాడుతూ వచ్చి... సెటిల్‌ మెంట్‌ ఆఫర్ గురించి ఒకే ఒక్క వ్యాక్యం ప్రస్తావించారని అరుణ్ జైట్లీ రాశాను. ఇలాంటి ఉత్తుత్తి ఆఫర్లు అప్పటికే చాలా చూసి ఉన్నందున.. ఆ ఆఫర్ల గురించి తనతో మాట్లాడి లాభం లేదని, బ్యాంకర్లకు ఆ ఆఫర్లను ఇవ్వమని చెప్పానని అరుణ్ జైట్లీ రాశాను. విజయ్ మాల్యా తన చేతిలో చూపుతున్న కాగితాలేవో తనకు మాత్రం అందలేదని మంత్రి స్పష్టం చేశారు.