ఏపీలో ఎయిర్ ఫోర్స్ కొత్త స్థావరాలు

ఏపీలో ఎయిర్ ఫోర్స్ కొత్త స్థావరాలు

ఆంధ్రాలో వ్యూహాత్మక స్థావరాల ఏర్పాటు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. చైనా కదలికల్ని కొంతకాలంగా తీవ్రంగా అనుమానిస్తున్న భారత్ తూర్పు తీరం మీద నిఘా తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అనంతపురం జిల్లాలో డ్రోన్ తయారీ కర్మాగారాన్ని, అమరావతిలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ తో పాటు రాజమండ్రి, విజయవాడల్లోని ఎయిర్ పోర్టులను భద్రత పరంగా మరింత డెవలప్ చేయాలన్న ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ముందుంచింది. దీనిపై ఆంధ్రా సర్కారు వెంటనే ఓ టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేసి ఆయా ప్రాజెక్టులపై ఐఏఎఫ్ తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించడం విశేషం. 

వ్యూహాత్మక పద్ధతిలో ఆయా ప్రాంతాల్ని డెవలప్ చేశాక.. ఎప్పుడెలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేలాగా ఉండడంతో పాటు.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్పందించడానికి కూడా భద్రతా దళాలు సర్వసన్నద్ధంగా ఉంటాయి. 
ఐఏఎఫ్ కి చెన్నై సమీపంలోని అరక్కోణంలో ఒక ఎయిర్ బేస్, విశాఖలో యుద్ధ నౌకల బేస్ ఉన్నాయి.