వెంకీ వలన నాగ చైతన్యకు ప్రమాదం

వెంకీ వలన నాగ చైతన్యకు ప్రమాదం

యువ హీరో నాగచైతన్య, సీనియర్ హీరో వెంకటేష్ కలిసి 'వెంకీ మామ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  కెఎస్ రవీంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.  వాస్తవంగా మామ అల్లుళ్ళు అయిన వెంకీ, చైతన్యలు సినిమాలో కూడా మామ అల్లుళ్లుగానే కనిపించనున్నారు.  ఈ సినిమా కథ కొత్తగా, వింతగా ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అదేమిటంటే సినిమాలో జాతకాలు, జ్యోతిష్యం ప్రకారం వెంకీ వలన నాగ చైతన్యకు ప్రమాదం ఉంటుందని, ఆ పాయింట్ మీదనే సినిమాలో ఫన్ నడుస్తుందని తెలుస్తోంది.  సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు.