చైనాను ముంచెత్తుతున్న కొత్త చాలెంజ్

చైనాను ముంచెత్తుతున్న కొత్త చాలెంజ్

ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బౌల్ చాలెంజ్, కికి చాలెంజ్ ల్లాగే మరో కొత్త చాలెంజ్ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. ఫాలింగ్ స్టార్స్-2018 పేరుతో ఇంటర్నెట్ లో తెగ దర్శనమిస్తోంది. ఈ చాలెంజ్ విసిరే వ్యక్తులు రోడ్డు మీద పూర్తిగా బోర్లా పడిపోయి ఉంటారు. వారి చుట్టూ తమ ఖరీదైన వస్తువులు, కట్టలకొద్దీ క్యాష్ బయటపడి చిందరవందరగా ఉంటుంది. సదరు వ్యక్తులు దాన్నేమీ పట్టించుకోకుండా అలా పడిపోయి ఉంటారు. ఖరీదైన కార్లలోంచి, ఇతర వెహికల్స్ నుంచి, పడవల్లోంచి పడిపోయి వస్తువుల్ని ప్రదర్శిస్తారు. గత ఆగస్టులోనే ఈ తరహా చాలెంజ్ రష్యాలో మొదలైందని.. అయితే చైనాలో ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయిందని నెటిజన్ల ట్వీట్లను బట్టి తెలుస్తోంది. 

అయితే ఈ చాలెంజ్ లో డబ్బు, దర్పాన్ని చాటుకోవడం, అహంకారాన్ని ప్రదర్శించడం తప్ప సోషల్ థీమ్ ఏమీ లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో విపరీతంగా తయారైంది.